57 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళన గురి చేస్తోంది. డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్‌ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ ఇప్పుడు 57 దేశాలకు పాకింది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

యూకేలో 437, డెన్మార్క్‌లో 398, దక్షిణాఫ్రికాలో 255, యూఎస్‌లో 50, జింబాబ్వేలో 50, భారత్‌లో 23తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే ఆయా దేశాలు ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మరోసారి లాక్‌డౌన్‌ను కూడా విధించారు. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావం భారత్‌లో కూడా మొదలైంది. ఇప్పటికే 23 ఒమిక్రాన్ కేసులు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు నిర్వహించే కరోనా పరీక్షల విధానాన్ని మరింత పటిష్టం చేసింది.

Related Articles

Latest Articles