ఒమిక్రాన్ అల‌ర్ట్‌: తీవ్ర‌త తక్కువే కానీ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి…

క‌రోనా ఒమిక్రాన్ కేసులు తీవ్ర‌స్థాయిలో పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.  ఒమిక్రాన్  వ్యాప్తి అధికంగా ఉన్నా తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని, త‌ప్ప‌ని స‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ మాస్క్ ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా పేర్కొన్నారు.  ఒమిక్రాన్ అప్ప‌ర్ రెస్పిరేట‌రీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని, ఫ‌లితంగా జలుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, త‌ల‌నొప్పి, ఒళ్ళునొప్పులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని, ఈ ల‌క్ష‌ణాలు ఉంటే త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అన్నారు.  ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉన్నా, తీవ్ర‌త త‌క్కువగా ఉన్నా నిబంధ‌న‌లు పాటించ‌కుంటే ఆసుప‌త్రుల్లో చేరాల్సి వ‌స్తుంద‌ని, త‌ద్వారా మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంటుందిని అన్నారు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగిన వ్య‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని, అప్పుడే వైర‌స్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉంటుంద‌ని ర‌ణ‌దీప్ గులేరియా పేర్కొన్నారు.  

Read: దేశంలో మ‌రో సీఎంకు క‌రోనా…

Related Articles

Latest Articles