ఏపీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు

ఏపీలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో బుధవారం మధ్యాహ్నం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరితో పాటు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.

Read Also: పావురం కాలికి చైనా ట్యాగ్… అసలు ఏం జరుగుతోంది?

కొత్తగా ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండగా… గుంటూరు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఏపీలో కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో 334 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

Related Articles

Latest Articles