భారత్ లో 5 కు చేరిన ఒమి క్రాన్ కేసులు

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ 38 దేశాలకు పాకేసిందని నిపుణుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మన దేశంలోనూ ఈ వేరియంట్‌ ప్రవేశించింది. ఇప్పటికే భారత్‌లో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య 5 కు చేరుకుంది.

తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. అతన్ని ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రికి తరలించి… చికిత్స అందిస్తున్నారు. మొన్న కర్ణాటకలో రెండు, నిన్న గుజరాత్‌, మహారాష్ట్ర లో ఒక్కో కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles