అభిమానులు లేకుండానే ఒలంపిక్స్…

గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్స్ పై కరోనా నీలి నీడలు కముకున్నాయి. ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అక్కడ జపాన్ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే కేసులు పెరుగుతుండటంతో అత్యవసర సమావేశమైన ఒలంపిక్స్ నిర్వాహకులు ఈ గేమ్స్ కు అభిమానుల అనుమతి నిరాకరించారు. అయితే ఈ ఏడాది జరిగే ఒలంపిక్స్ 2021 ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయన్నమాట..! ఇక ఇప్పటికే ఈ గేమ్స్ కోసం టోక్యో చేరుకున్న కొంత మంది అథ్లెట్లు కరోనా బారిన పడటంతో కఠిన ఆంక్షలు పాటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఒలంపిక్స్ లో పాల్గొనడానికి మొత్తం 11,000 లకు పైగా అథ్లెట్లు రానున్నట్లు తెలుస్తుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-