మహిళల పై అనుచిత పోస్ట్స్.. ఆటగాడిని సస్పెండ్ చేసిన ఇంగ్లండ్ బోర్డు

ప్రస్తుతం ఇంగ్లండ్-న్యూజిలాండ్‌ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్‌సన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన ఈ యువ పేసర్ గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్స్ వివాదం రేపాయి. 2012 నుంచి 2014 మధ్యలో ట్విటర్‌లో స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు పోస్ట్ చేశాడు ఈ పేసర్. ప్రస్తుతం ఈ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . దాంతో అతనిపై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ఈసీబీ) విచారణకు ఆదేశించింది. అయితే దాని ఫలితాలు ఇంకా రాకున్నా ఇంగ్లాండ్ బోర్డు సస్సెక్స్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అన్ని అంతర్జాతీయ క్రికెట్ల నుండి సస్పెండ్ చేసింది. దాంతో జూన్ 10న ప్రారంభమయ్యే రెండవ టెస్టుకు అతను అందుబాటులో ఉండడు. అయితే ఓలీ రాబిన్​సన్​ ఆ ట్వీట్లపై స్పందిస్తూ… మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని అంగీకరించాడు. అయిన ఇప్పుడు అతని పై వేటు తప్పలేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-