ఓయూలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా

కరోనా, ఒమిక్రాన్‌ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. వీటి దెబ్బకు అన్ని వ్యాపారసముదాయాలు, విద్యాసంస్థలు ఇతర పనులు వాయిదా, లేదంటే మొత్తంగా మూత పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కరోనా,ఒమిక్రాన్‌ దెబ్బ అన్నింటి కన్నా ఎక్కువగా విద్యాసంస్థలపై పడింది. ఎప్పుడు ఏమౌవుతుందోనని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. అయితే తాజాగా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సీటీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను విశ్వ విద్యాలయం వాయిదా వేసింది.

Read Also: బండి సంజయ్‌ అంటే ప్రభుత్వానికి భయం: తరుణ్‌చుగ్‌

కరోనా, ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఓయూ పరిధిలో ఈ నెల 8వ తేది నుంచి 16వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 8 నుంచి16 వరకు సెలవులు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Related Articles

Latest Articles