బ్రేకింగ్ : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్న విషయం విదితమే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తుండగా, మేకర్స్ మాత్రం సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని ఇప్పటి వరకూ చెప్తూ వచ్చారు. అయితే ఒకవైపు రోజురోజుకూ ఆందోళకరంగా మారుతున్న పరిస్థితులు, మరోవైపు రూమర్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా విడుదల గురించి ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని చెప్పాలి. నిన్నటిదాక కూడా సినిమా విడుదల ఉంటుందని చెప్పిన “రాధేశ్యామ్” నిర్మాతలు ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం వేరే మార్గం లేకపోవడంతో రాధే శ్యామ్ మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.

Read Also : రూమర్స్ నమ్మొద్దు… ‘బంగార్రాజు’ అప్డేట్

“ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా మా సినిమా “రాధేశ్యామ్” విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. మీ బేషరతు ప్రేమ, మద్దతు కోసం అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో థియేటర్లలో కలుద్దాం..!” అంటూ సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. టైమ్ ట్రావెల్‌తో కూడిన ఈ భారీ పీరియాడిక్ ఎపిక్ లవ్ స్టోరీ కూడా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. అయితే మేకర్స్ మార్చి 18న సినిమాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

చిత్రం

Related Articles

Latest Articles