Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Bjp %e0%b0%8f%e0%b0%aa%e0%b1%80 %e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80 %e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b1%80 %e0%b0%9a%e0%b1%80%e0%b0%ab%e0%b1%8d %e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%86

BJP : ఏపీ బీజేపీ మాజీ చీఫ్ దారెటు.?కేడర్ ఆయనపై అసంతృప్తిగా ఉందా.?

Updated On - 12:16 PM, Fri - 24 June 22
By Sista Madhuri
BJP : ఏపీ బీజేపీ మాజీ చీఫ్ దారెటు.?కేడర్ ఆయనపై అసంతృప్తిగా ఉందా.?

మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్‌కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు. వైసీపీ ఆహ్వానాన్ని కాదని.. బీజేపీలో చేరడం.. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్‌ కావడం.. ఆయన నేతృత్వంలో 2019 ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో కన్నా మౌనం కేడర్‌కు అంతుచిక్కడం లేదట.

కొద్ది రోజులుగా కన్నా లక్ష్మీనారాయణను రాజ్యసభకు పంపుతారని.. అందుకే ఏపీ బీజేపీ చీఫ్‌ పదవి నుంచి తప్పించారని అనుచరులు ప్రచారం చేశారు. అయితే ఏపీలో బీజేపీ పరిస్థితి కారణంగా అది ఆలస్యమైనా.. ఎన్నికల లోపు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నారట. మరి.. రాజ్యసభ సీటు ఇవ్వకపోతే కన్నా ఏం చేస్తారు అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గెలిస్తే ఏంటి? గెలవకపోతే ఏం జరుగుతుంది అనే లెక్కలతో కేడర్‌ కుస్తీ పడుతోందట. పల్నాడు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని కొందరి వాదన. తనకు అచ్చి వచ్చిన పెదకూరపాడు నియోజకవర్గం ఉన్న లోక్‌సభ స్థానమైన నరసరావుపేట లేదా సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారని మరికొందరు చెబుతున్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న గుంటూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి నుంచే యాక్టివ్‌ కావాలని అనుచరులు కన్నాకు సూచిస్తున్నారట. కూలింగ్‌ పిరియడ్‌ అయిపోయిందని.. సెగ్మెంట్‌ ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయి నుంచి పని మొదలు పెట్టకపోతే ఇబ్బందులు ఎదురు కావొచ్చని హెచ్చరిస్తున్నారట. బీజేపీ నాయకత్వం రాజ్యసభ సీటు ఆఫర్‌ చేస్తే అప్పుడు చూద్దాం.. అప్పటి వరకు కామ్‌గా ఉండటం సరికాదన్నది కన్నా అంతర్గత సర్కిళ్లతో వినిపిస్తున్న మాట. గతంలో సీఎం పదవి వరకూ కన్నా పేరు చర్చల్లోకి వెళ్లిందని.. అలాంటి నాయకుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటకపోతే ఇమేజ్‌ కూడా ప్రమాదంలో పడుతుందని అనుచరులు ఆందోళన చెందుతున్నారట.

అభిమానులు, అనుచరులు చెప్పింది సావధానంగా ఆలకిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ.. తాను బీజేపీలో ప్రశాంతంగా ఉన్నానని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని..బీజేపీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధంగా ఉన్నానని కేడర్‌కు బదులిస్తున్నారట కన్నా. అయితే కన్నా విషయంలో బీజేపీ హైకమాండ్‌ ఏం ఆలోచిస్తుందన్నదే ప్రస్తుతం ప్రశ్న.

 

 

  • Tags
  • AP BJP
  • ap politics
  • bjp
  • Guntur
  • kanna lakshminarayana

RELATED ARTICLES

BJP : తెలుగు రాష్ట్రాల్లో ఆ సామజిక వర్గం బీజేపీపై ఆగ్రహంతో ఉందా.? l

TDP : ఆ మాజీ మంత్రి టైం చూసి పావులు కదుపుతున్నారా.? లేక స్పీడ్ పెంచారా.?

Narayana: అగ్నిపథ్‌ స్కీమ్‌.. కిషన్‌రెడ్డికి నారాయణ కౌంటర్

Maharashtra Political Crisis: బలపరీక్షకు వెళ్లే ఆలోచనలో శివసేన

KTR: ఢిల్లీలో కేటీఆర్‌ బిజీబిజీ.. కేంద్రమంత్రి హ‌రిదీప్ సింగ్‌ పూరీతో భేటీ

తాజావార్తలు

  • Live : ఉద్ధవ్ కు ఎకనాథ్ షిండే కౌంటర్… నెంబర్ గేమ్ స్టార్ట్స్ |

  • Live :Revanth Reddy | Meeting Army Aspirants at Chanchalguda Jail | Ntv Live

  • Maharashtra Politics: వేడెక్కిన ‘మహా’ రాజకీయం.. షిండే శిబిరంలో 50 మంది!

  • Breaking : సీఎం జగన్‌తో కిడాంబి శ్రీకాంత్ భేటీ

  • Hyderabadi Biryani: అంతరాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ..

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions