పాఠ్యాంశంగా కరోనా మహమ్మారి!

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే వుంది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణను చేర్చాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. బీజేడీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈ విషయంపై తీర్మానాన్ని ఆమోదించారు. తరచూ తుపానులు, మహమ్మారి వంటి విపత్తుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మంత్రి మండలి తెలిపింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-