వరెస్ట్ పెర్ఫామెన్స్ తో మరోసారి జైలుకు జెస్సీ!

బిగ్ బాస్ సీజన్ 5లో కెప్టెన్ గా విఫలమైన జెస్సీని ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది. అతని తప్పు కాకపోయినా… హౌస్ మెంబర్స్ ను అదుపు చేయని కారణంగా జెస్సీ గురువారం వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఏకంగా నాలుగు ఓట్లు పొందాడు. అతని తర్వాత వరెస్ట్ పెర్ఫార్మర్ గా మూడు ఓట్లతో లోబో నిలిచాడు. అయితే… వీరిద్దరిలో ఒకరిని జైలుకు పంపమని కెప్టెన్ శ్రీరామ్ ను బిగ్ బాస్ ఆదేశించాడు. ఇప్పటికే ఒకసారి జెస్సీ జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి… ఈసారి లోబోను జైలుకు పంపితే బాగుంటుందనే అభిప్రాయానికి శ్రీరామ్ వచ్చాడు. ఈ విషయంలో ఇంటి సభ్యుల అభిప్రాయం కూడా తీసుకోవాలనుకున్నాడు శ్రీరామ్. అందులో మెజారిటీ సభ్యులు జెస్సీ పేరు చెప్పడంతో, తనకిష్టం లేకపోయినా జెస్సీని జైలుకు పంపాడు శ్రీరామ్. వరెస్ట్ పెర్ఫార్మర్స్ పరిస్థితి ఇలా ఉంటే, బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన వ్యక్తిగా మానస్ నిలిచాడు. విశ్వ – రవి; సిరి – షణ్ముఖ్; నటరాజ్ -లోబో; కాజల్ – జెస్సీ; ప్రియ – ప్రియాంక ఈ అయిదు జట్లు… మానస్ ను బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేశాయి. టాస్క్ లో భాగంగా మానస్ రెండు రోజుల్లో ఏకంగా ఆరు కేజీల బరువు తగ్గడమే వీరందరి మనసు దోచుకోవడానికి కారణమైంది. ఇక మిగిలిన జట్లలో శ్రీరామ్ -హమీద; సన్నీ – మానస్ లోబోను, యాని – శ్వేత శ్రీరామ్ ను బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేశారు. జెస్సీ, లోబోతో పాటు వరెస్ట్ పెర్ఫార్మర్ జాబితాలో కాజల్ కూ చోటు దక్కింది. యాని – శ్వేత కాజల్ ను వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేశారు.

లగ్జరీ టాస్క్ లో ఘన విజయం!
ప్రతి వారం లగ్జరీ టాస్క్ భిన్నంగా ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి కూడా ‘ఊలాలా… లా లా’ పేరుతో ఓ ఆట ఆడించాడు. టీవీ స్క్రీన్ మీద ఏ సభ్యుడి పేరు కనిపిస్తుందో వారు పెద్ద రింగ్ ను నడుముపై పెట్టుకుని 30 సెకన్ల పాటు అది కిందపడిపోకుండా ఆడాలి. గెలిచిన వారికి ఏ ఆహారం ఇస్తారనేది కూడా టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. హౌస్ మేట్స్ కోసం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో లోబో చికిన్, విశ్వ మటన్, ప్రియా మష్ రూమ్స్, రవి పీనట్ బట్టర్ ను సక్సెస్ ఫుల్ గా గెలుచుకున్నారు.

బ్యూటీ క్వీన్ ప్రియా!
గురువారం సౌందర్య సాధనాల ఉత్పాదక సంస్థ వోజీవా ప్రాడక్ట్స్ తో బిగ్ బాస్ ఓ టాస్క్ ను ప్లాన్ చేశాడు. ఐదురుగు అమ్మాయిలను పోటీలో నిలిపి, ఆ సంస్థ తయారుచేసిన వాటిని ఎవరు ముందుగా పెర్ఫెక్ట్ గా ఉపయోగిస్తారో వారిని బ్యూటీ క్వీన్ గా ఎంపిక చేయమని శ్రీరామ్ కు చెప్పాడు. ఆ గేమ్ లో యాని, ప్రియాంక, సిరి, ప్రియ, శ్వేత వర్మ పోటీ పడ్డారు. అయితే ప్రియ సౌందర్యోపకరణాలను పర్ ఫెక్ట్ గా ఉపయోగించి విజేతగా నిలిచింది.

ఆ తర్వాత సన్నీ తన ఓల్డ్ ప్రొఫెషన్ లోకి కాసేపు పరకాయ ప్రవేశం చేశాడు. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సన్నిని బిగ్ బాస్ ఫ్రైడే నైట్ షో పేరుతో శ్రీరామ్ ను ఇంటర్వ్యూ చేయమని కోరాడు. దాంతో బేసికల్ గా జర్నలిస్ట్ టింజ్ ఉన్న సన్నీ… ఈ టాస్క్ లో అల్లుకుపోయాడు. మధ్య మధ్యలో లోబో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుని, ఎంటర్ టైన్ మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. లోబోతో పాటు చివరిలో సన్నీ సైతం హౌస్ మేట్స్ ను తనదైన శైలిలో ఇమిటేట్ చేసి నవ్వుల పువ్వుల పూయించాడు. జెస్సీ జైలు కు వెళ్లాడనే బాధ తప్పితే, 26వ రోజంతా చాలా స్మూత్ గా హౌస్ సాగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే… శ్రీరామ్ – హమీదా మధ్య ప్రేమ ముదిరి పాకన పడినట్టు అనిపిస్తోంది. రాత్రి 12 గంటల వరకూ కబుర్లు చెప్పుకుంటూనే టైమ్ పాస్ చేస్తున్న ఈ జోడీ… గురువారం రాత్రి కూడా 3.15 నిమిషాల వరకూ పడుకోలేదు. శ్రీరామ్ సైతం నిద్ర పట్టక గిటార్ తీసుకుని హమీదాను ఉద్దేశించి చక్కని ప్రేమ గీతం పాడాడు. మరి ఇప్పటికే నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ఎవరు హౌస్ నుండి బయటకు వెళతారో చూడాలి.

-Advertisement-వరెస్ట్ పెర్ఫామెన్స్ తో మరోసారి జైలుకు జెస్సీ!

Related Articles

Latest Articles