2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయాల్సిందే…

వివిధ శాఖల్లో లక్ష 96 వేల ఉద్యోగాలు ఉన్నాయని పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. కానీ 50 వేల పోస్ట్ లు భర్తీ చేస్తామనడం కంటితుడుపు చర్య మాత్రమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ వేయాల్సిందే… తొలగించిన స్టాఫ్ నర్సు లను వెంటనే తీసుకోవాలి అని తెలిపారు. ఇక ఏడు ఏళ్ళల్లో 7 చుక్కల నీళ్లు అయినా అదనంగా ఈ రాష్ట్ర వాటా కింద తీసుకురాలేదు. తెలంగాణ సాదించుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం….నియామకాలు లేవు.. నిధులు లేవు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. నీళ్లు లేవు అన్నారు. రేవంత్ రెడ్డి తెరాస టీడీపీ మయం అయిందంటాడు.. కోమటిరెడ్డి కాంగ్రెస్ టీడీపీ మయం అయిందని అంటున్నాడు….ఉన్న తెరాస కాంగ్రెస్ మయం అయింది… అన్ని తెరాస వశం అయ్యాయి.. సిస్టర్ షర్మిల వైఎస్ భారతి భయానికి , కేసీఆర్ కనుసన్నల్లో ఇక్కడ పార్టీ పెట్టింది.. వైఎస్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి తల్లీ కూతుళ్లు లోటస్ పాండ్ లోకి అడుగుపెట్టారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-