మళ్లీ ఒళ్లు విరుచుకుని పనికి బయలుదేరుతోన్న బాలీవుడ్!

మహారాష్ట్రలో కరోనా కలకలం కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా, ముంబైలో నిదానంగా సడలింపులు మొదలయ్యాయి. దాంతో బాలీవుడ్ నటీనటులు వీలైనంతగా యాక్టివ్ అవుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్స్ స్టార్ట్ కానప్పటికీ డబ్బింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకుంటున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ నుస్రత్ బరూచా ఇంటి నుంచీ కాలు బయట పెట్టింది. ఆమె నటించిన ‘చోరీ’ మూవీ డబ్బింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కరోనా సంబంధమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే నుస్రత్ డబ్బింగ్ చెప్పబోతోందని ఆమె క్లోజ్ అసోసియేట్స్ చెబుతున్నారు.

‘చోరీ’ మూవీ ఒక హారర్ థ్రిల్లర్. సినిమా షూటింగ్ పోయిన డిసెంబర్ లోనే ముగిసింది. 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే, తరువాత అనూహ్యంగా వచ్చి పడ్డ లాక్ డౌన్ తో ‘చోరి’ పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్ లో యాక్టివిటి మొదలవుతోన్న వేళ ‘చోరి’ దర్శకనిర్మాతలు ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. చూడాలి మరి, నుస్రత్ బరూచ హారర్ థ్రిల్లర్ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-