టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్నదానికంటే శరవేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి.

2.దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం కలిగిస్తోంది.ఢిల్లీలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఢిల్లీ వాసుల్ని కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్​ బిశ్వాల్​ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతున్నారు.

3. 317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగాఆలోచిస్తుంటే, అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.

4.సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే .. తెలంగాణలో ఈ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవరసరం లేదు. రాఘవకు ఎలాగైనా శిక్ష పడాలంటూ తన చివరి సెల్ఫీ వీడియోలో రామకృష్ణ కోరారు. కాగా తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 

5. ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో సీఎం జగన్ ఆత్మకూరు వచ్చి చూడాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హితవు పలికారు. ఆత్మకూరులో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌లను పక్కన కూర్చోబెట్టుకుని పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

6.దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఒక్కరోజులోనే లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని.. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ తిరుగుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, బయటికెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

7.కరోనా నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన వారినే అనుమతించాలని, తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ సూచించారు.

8.సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ వాళ్లు పరిశ్రమలో ఉన్నారు కాబట్టే సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్ ఇస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు. సినిమా టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

9.ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీసెస్‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను చెక్‌ చేయడంపై అధికారులు సమీక్షించారు. 

10.టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా కి కవర్ సాంగ్ చేసి మరోసారి సామ్ ని గుర్తుచేసింది. 

Related Articles

Latest Articles