టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు.

2.మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చకు మేము సిద్దం అన్నారు.

3.తెలంగాణలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా కొత్త క్రీడల విధానం రాబోతందన్నారు మంత్రి కేటీఆర్. ఇది దేశంలో అత్యత్తమ విధానం అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ మారింది. ప్రాథమిక పాఠశాలల నుండి… ఇది ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలి. కేవలం పని, చదువు మీదే కాదు. ఆటలు, ఫిజికల్ ఫిట్ నేస్, ఫిజికల్ విద్య తప్పనిసరి. 

4.వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్‌ కాటేస్తున్నాడని వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్‌ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్‌ లో విమర్శలు గుప్పించారు.

5.కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించారు. రెండవ ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయిలో వాహనాల అనుమతి ప్రారంభించింది టీటీడీ. జెండా ఊపి వాహనాలను అనుమతించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. రెండవ ఘాట్ రోడ్డు ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

6.విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం మధ్యాహ్నం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్‌ను స్వాత్మానందేంద్ర సరస్వతి ఆహ్వానించారు.

7.స్వేచ్ఛగా తిరిగే పావురం అక్కడ బందీగా మారింది. ఎందుకంటే ఆ పావురం కాలికి వున్న ట్యాగ్. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో పావురాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి ఆటో నగర్ లో పావురం అందరినీ హడలెత్తించింది. పావురానికి కాలికి ట్యాగ్ ను గుర్తించారు స్థానికులు. అది ఎక్కడినుంచి ఎగురుకుంటూ వచ్చిందోనని అంతా ఆందోళనకు గురయ్యారు.

8.కోలీవుడ్ స్టార్ హీరో శింబు అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో గౌరవించింది. అతి చిన్న వయస్సులో డాక్టరేట్ అందుకున్న వ్యక్తుల్లో శింబు ఒకడిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 

9.ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా… మంగళవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిక్కెట్ల కమిటీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఫిల్మ్ గోయర్ సభ్యుడు రాకేష్ రెడ్డి ఇచ్చిన రిపోర్టును కమిటీ అభినందించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి రాకేష్‌రెడ్డి సమగ్రంగా నివేదిక తయారుచేసినట్లు తెలుస్తోంది.

10.ఐపీఎల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌కు ఇప్పటివరకు స్పాన్సర్‌గా కొనసాగుతున్న చైనా కంపెనీ ‘వివో’తో బీసీసీఐ బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. వివో స్థానంలో భారతీయ కంపెనీ టాటా రానున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి టాటా గ్రూప్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. దీంతో త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 టైటిల్ స్పాన్సర్‌గా టాటా కంపెనీ వ్యవహరించనుంది.

Related Articles

Latest Articles