టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.దేశంలోకి థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయిందని చెప్ప‌డానికి పెరుగుతున్న కేసులే ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.  జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  అయితే, ముంబై, ఢిల్లీ వంటి మ‌హాన‌గ‌రాల్లో ప్ర‌తిరోజూ కేసులు పీక్స్‌లో న‌మోద‌వుతున్నాయ‌ని, జ‌న‌వ‌రి మిడిల్ వ‌రకు 30 వేల నుంచి 60 వేల మ‌ధ్య‌లో కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఐటి కాన్పూర్ శాస్త్ర‌వేత్త మ‌హీంద్రా అగ‌ర్వాల్ పేర్కొన్నారు.

2.ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్ప‌టికే ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. వీకెండ్ క‌ర్ప్యూ అమ‌లు జ‌రుగుతున్న‌ది. శ‌ని, ఆదివారాల్లో పూర్తిస‌స్థాయిలో క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తిరోజూ కేసులు 30 శాతానికి పైగా పెరుగుతున్నాయి. శ‌నివారం రోజున 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఈరోజు అంత‌కంటే ఎక్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స్వ‌యంగా ముఖ్య‌మంత్రే తెలియ‌జేశారు.

3.రాష్ట్రంలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. గ్రామపంచాయతీల అనుమతితో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మొదలు అన్ని మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేసి కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఈ విషయంలో పక్కాగా ముందుకెళ్ళాలని అధికారులు భావిస్తున్నారు.

4.ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మరో నటుడిపై పడింది. ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువ మంది సెలెబ్రిటీలకు కోవిడ్-19 సోకుతుండడం గమనార్హం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలెబ్రిటీలంతా వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు దాదాపు రోజుకు ఇద్దరు ముగ్గురు సెలెబ్రిటీలు చేరిపోతున్నారు. 

5.ఇండియా జెయింట్ వ్యాపార దిగ్గ‌జం రిల‌యన్స్ అమెరికాలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మవుతున్న‌ది. ఇప్ప‌టికే అనేక రంగాల్లోకి ప్ర‌వేశించిన రిల‌య‌న్స్ సంస్థ తాజాగా హోట‌ల్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అమెరికా ఆర్థిక రాజ‌ధాని న్యూయార్క్ న‌గ‌రంలోని మిడ్‌టౌన్ మాన్‌హ‌ట్ట‌న్ లోని మాండేరియ‌న్ ఓరియంట‌ల్ ఫైవ్ స్టార్ హోట‌ల్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ద‌మ‌యింది. 100 మిలియ‌న్ డాల‌ర్ల‌తో మాండేరియ‌న్ ఓరియంట‌ల్ హోట‌ల్‌ను కొనుగోలు చేస్తున్న‌ట్టు రిల‌య‌న్స్ సంస్థ స్ప‌ష్టం చేసింది.

6.ఉద్యోగ బదీలీలపై కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారటీఆర్‌ఎస్‌, బీజేపీ పై మండిపడ్డారు. జీఓ 317తో స్థానికత అనేదానికి న్యాయం లేకుండా పోయిందన్నారు. స్థానికత కోసం తెచ్చుకున్న తెలంగాణలో నేడు గందరగోళం సృష్టించారన్నారు. స్థానికత పై రాష్ట్రం పంపిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదని ప్రశ్నించారు. 

7.ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంత ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నకల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సభలు, సమావేశాలు, రాజకీయా నేతల పర్యటనలతో హీట్‌ పెంచుతున్నారు.. కోవిడ్‌ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినా.. స్టేట్‌మెంట్లు, ఆరోపణలు, విమర్శలతో మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నారు.

8.కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు… సామాన్యుల నుంచి ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు.. ఇలా ఎవ్వరికీ మినహాయింపు లేదు అనే విధంగా పంజా విసురుతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయిపోయింది.. ఈ సారి సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్‌ బారిన పడ్డారు.. తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది.. సీఎం హేమంత్ సోరెన్​సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్‌ బారినపడ్డారు.. వీరిలో సోరెన్ మరదలు సరళ మర్ముకూ కూడా ఉన్నారు..

9.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్‌ వేదికగా జరగనున్న లెజెండ్స్‌ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్‌ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్‌లో ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

10.ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. అయితే అన్నయ్యను కడసారిగా కూడా చూసుకునే భాగ్యం కలగలేదు మహేష్ బాబుకు కలగలేదు.అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య…’ అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles