టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు.

2.తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్‌ దళిత బంధును అందజేయాలని కార్యచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.

3.ఏపీలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 840 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,79,763 కి పెరిగిందిఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 501 కి చేరింది.

4.తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు..

5.దీక్షకు దిగిన సంజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు.

6 ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. బిసీలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అయితే..ఆయన్ను పదవీవీచ్చుతుణ్ని చేసిన సందర్భంలో, మరణించినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీసాయన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి. బీసీలంటే టీడీపీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు.

7.కరోనా, ఒమిక్రాన్‌ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. వీటి దెబ్బకు అన్ని వ్యాపారసముదాయాలు, విద్యాసంస్థలు ఇతర పనులు వాయిదా, లేదంటే మొత్తంగా మూత పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కరోనా,ఒమిక్రాన్‌ దెబ్బ అన్నింటి కన్నా ఎక్కువగా విద్యాసంస్థలపై పడింది. ఎప్పుడు ఏమౌవుతుందోనని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. 

8.గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్​ బియ్యం ప్రజలకు అందించడం లేదు.

9 టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా తనికెళ్ళ భరణి సుపరిచితుడే. ఇక ఆయన శివుడిపై రాసే కవితలకు ఫ్యాన్స్ మాములుగా ఉండరు. అయితే చిత్ర పరిశ్రమలో ఉంటున్నామంటే ఎన్ని పురస్కారాలు ఉంటాయో.. అన్ని తిరస్కారాలు కూడా ఉంటాయి. ఎంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారో అంతేముంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. తాజగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తిట్టడం కాదు.. చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు.

10.దక్షిణాదిన సమంతకు స్టార్ హీరోయిన్ గా చక్కటి గుర్తింపు ఉంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్2’తో అటు ఉత్తరాదిలోనూ నటిగా చక్కటి ఇమేజ్ తెచ్చుకుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత పోషించిన నెగెటీవ్ రోల్ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బంది కలిగించినా ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గర చేసింది. ఇప్పుడు సమంత మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోంది. 

Related Articles

Latest Articles