టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్‌ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్‌ 2 పంచాయతీ రాజ్‌ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్‌ 2ను సస్పెండ్‌ చేసింది.

2.మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు.  రోజువారీ కేసులు మ‌హారాష్ట్ర‌లో 11 వేలు దాటిపోయాయి.  ముంబై న‌గ‌రంలో 8 వేల‌కు పైగా రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి.  పాజిటివిటీ శాతం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  దీంతో ముంబై నగ‌రంలో లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

3.ఏపీలో రాజకీయ కాక రేపుతోంది వంగవీటి రాధా రెక్కీ ఎపిసోడ్. ఈ కీలక అంశంపై మొదటి సారి స్పందించారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు టీడీపీ నేత వంగవీటి రాధా. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే అన్నారు నాని. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

4. ఎన్నికలు ఏం లేకపోయినా కేవలం ప్రజలు ఎలా వున్నారు, వారి సమస్యలను తెలుసుకోవడానికే పల్లెబాట చేపట్టాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులందరికీ పధకాలు అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకుంటున్నాం. కేవలం ఇల్లు, పెన్షన్ లాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు తీసుకొస్తున్నారు.

5.ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. 

6.ఏపీలో బీజేపీ స్ట్రాటజీ మారిపోతోంది. ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈసారి కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది. వివిధ ప్రధాన నగరాల్లో ముఖ్యమైన ప్రాంతాలకు ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోంది. ప్రత్యేకంగా ప్రజాగ్రహ సభ తర్వాత బీజేపీ పంథాలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. అయితే బీజేపీ ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. ముందు ముందు మరిన్ని సెన్సిటీవ్ అంశాలను టచ్ చేయడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది.

7.త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని అఖిలేష్ వివరించారు.

8.ప్ర‌పంచం మొత్తం ప్ర‌స్తుతం క‌రోనా, ఒమిక్రాన్ కేసుల‌తో అల్ల‌కల్లోలంగా మారింది.  క‌రోనా ధాటికి యూర‌ప్‌, అమెరికా దేశాలు అతలాకుత‌లం అవుతున్నాయి.  ముఖ్యంగా అమెరికాలు రోజువారీ కేసులు ల‌క్ష‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో మ‌రో కొత్త వేరియంట్ పుట్టుకువ‌చ్చింది.  కొత్త వేరియంట్ బి.1.640.2 గా గుర్తించారు.  కామెరూన్ నుంచి వ‌చ్చిన వారి ద్వారా ఈ వేరియంట్ ఫ్రాన్స్‌లోకి ప్ర‌వేశించింది.  

9.ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఇక తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి యంగ్ హీరో విశాల్ కూడా ఎంటర్ అయ్యాడు. తు.ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతి నటిస్తోంది. 

10. సంజనా గల్రాని.. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన బ్యూటీ.. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టడం తో ఆమె కెరీర్ మసక బారినట్లయ్యింది. జీవులకు వెల్ళడం .. బెయిల్ పై బయటికి రావడం.. ప్రేమించినవాడిని పెళ్లాడడం వరకు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక వివాహమైన తరువాత అమ్మడు కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం సంజనా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.

Related Articles

Latest Articles