టు డే ఎన్టీవీ టాప్ న్యూస్

1.గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి సోమవారం చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కన్నారు. నిన్న దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలోభాగంగానే చేశారన్నారు.

2.నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్‌ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారు.

3.తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో 84 కేసులకు చేరింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణలో 3779 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి. మొత్తం 21,679 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 274 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.

4.మహిళలు ఆర్దికంగా , సామాజికంగా ముందుకు వెళ్ళేందుకు కృషిచేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. వైసీపీలో లీడర్ ఒక్కరే అని. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

5.ఈ మధ్యే టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్‌ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్‌కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.

6.2018 తెలంగాణ, ఒరిస్సా సరిహద్దులో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో తెలంగాణ, ఒరిస్సా సరిహద్దు చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ప్రజా హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేశాయి.

7. గెలిచిన నియోజకవర్గాన్ని.. గెలిపించిన ప్రజలను ఆయన మర్చిపోయారా? స్థానిక పార్టీ కేడర్‌కు ముఖం చాటేస్తున్నారా? ఏ విషయంలో కేడర్‌కు భరోసా లభించడం లేదు? పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతపై గుర్రుగా ఉన్నాయా?

8 మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్లాడుతూ” కొంతమంది అవసరం వచ్చినప్పుడు తమ బుద్ధిని చూపిస్తారు.. కానీ, నేను ఎదుటువారి మంచి కోరుకొనేవాడిని.. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నా అభిమానులకు నేను ఒకటే చెప్పాను. 

9.మలయళ హీరో దిలీప్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదుర్కొంటున్నా, నటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను నటించిన ‘మై శాంటా’ 2019 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చింది. ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ‘కేశు ఈ వీడిండే నాథన్’ మూవీ డిసెంబర్ 31న రిలీజ్ అయ్యింది. తొలుత దీన్ని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా, కరోనా కారణంగా నిర్మాతలు మనసు మార్చుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు.

10.టీమిండియాలో గత కొంతకాలంగా జరుగుతోన్న పరిణామాలపై అనేక రకాల ప్రచారం జరిగింది.. విరాట్‌ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత.. బీసీసీఐ, టీమిండియాలోని కొందరు ఆటగాళ్లతో విరాట్‌ కోహ్లీకి విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి.. అయితే, ఈ పుకార్లపై తాజాగా స్పందించారు భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ… విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.

Related Articles

Latest Articles