టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి కాళ్లకు నమస్కరించారు.

2.ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రధాని మోడీతో భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధాని మోడీతో సీఎం జగన్‌ పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ వినతిప్రతం అందజేయనున్నారు. అమిత్‌ షా సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్‌ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

3.15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. చిన్నారులకు కోవిడ్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. అనేక యూరప్ దేశాలు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, న్యూజీలాండ్ తదితర దేశాల కన్నా భారతదేశం కంటే ముందున్నాయి.

4.ఏపీ భూములపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణ లో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్‌లోఅల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు ఏపీ, తెలంగాణ మంత్రులు ఆవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.

5.ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోనే బెస్ట్ డీజీపీగా నిలిచారు. ఆయన ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. 2021 సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ది బెటర్ ఇండియా సంస్థ విడుదల చేసింది.

6.తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా తిరుమల వచ్చిన వీఐపీలకే దర్శనం కల్పిస్తామన్నారు. చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదన్నారు.

7.విజయవాడ సిటీ బీజేపీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు ఆడ, మగ తేడా లేకుండా ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ సినిమా పాటకు చిందులేశారు. వారి వెనుక వైపు ప్రధాని మోదీ, జేపీ న‌డ్డా, సోము వీర్రాజులతో కూడిన ఫ్లెక్సీ ఉండ‌గా.. ఆ వేదిక పైనే బీజేపీ నేత‌లు డ్యాన్సులు వేశారు.

8.ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్‌ సిటీలోని మార్కెట్‌ దిగువన ఉన్న అండర్‌ గ్రౌండ్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

9.ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తాజాగా వేడుక జరిగింది. ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రపంచానికి తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది.

10.“ఆర్ఆర్ఆర్” మూవీ టీం అకస్మాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ఏ థియేటర్లు ఇప్పటికే విక్రయించిన ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్‌ల అమౌంట్ రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాయి.

11.భారత క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు.

Related Articles

Latest Articles