టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యంగా పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. మరోవైపు అధికారం తమదగ్గరే వుంచుకునేందుకు కాంగ్రెస్​ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్న పార్టీలు హామీల జల్లులు కురిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ 10 సూత్రాలతో ‘పంజాబ్​ మోడల్​’ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు.

2.దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. 2లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా వీఐపీలకు కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో 50 మంది కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.

3.సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండగ కావడంతో చాలా మంది వారం రోజుల పాటు స్వగ్రామాలలో గడిపేందుకు ఊరికి వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయం కోసం వేచిచూస్తున్న దొంగలు పలు చోట్ల రెక్కీలు నిర్వహిస్తున్నారు. దోపిడీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

4. టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసానని కోల్పోయారన్నారు. ఓటీఎస్‌ పై టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు అధికారంలో ఉండగా కుంభకర్ణుడిలా నిద్రపోయారంటూ ఎద్దేవా చేశారు.

5.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్‌ వేదికగా టీడీపీ పై విమర్శలు గుప్పించారు.‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయిందని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ట్విట్టర్‌లో ఆయన పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట. వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? 

6.కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!?

7.తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నాడు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిత్యసేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది.

8.కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కాలేజీల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో ఆఖరికి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఎక్కడా చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది.

9.అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి గాసిప్స్ తగ్గలేదు, అలాగే అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఆసక్తీ తగ్గలేదు. ఎందుకంటే వీరిద్దరూ విడిపోతున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. 

10.తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఎప్పటికప్పుడు వస్తున్న క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. 

Related Articles

Latest Articles