ఎన్టీవీ షార్ట్ న్యూస్

1) భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు… ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్‌లో కొత్తగా 1,59,632 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 327 మంది కరోనాతో మృతి చెందారు. అటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 3,623కి చేరింది.

2) ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన షాక్‌తోనే ఈరోజు చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే ముందు కుప్పం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.

3) హీరో మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు మృతి పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్, మాజీ సీఎం చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు ప్రముఖులు రమేష్‌బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కరోనా నిబంధనలను అనుసరించి రమేష్‌బాబు అంత్యక్రియలు జరుగుతున్నాయి.

4) ఏపీలో సంచలనం సృష్టించిన పాలడుగు గ్యాంగ్ రేప్ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలియజేశారు

5) కరోనా థర్డ్ వేవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు వైద్య నిపుణులు, కేంద్ర మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం, లాక్‌ డౌన్‌ ప్రకటిస్తే జరిగే పరిణామాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.

6)తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పంట భీమా అమలు చేయని ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే అన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల ను ఆశ్రయించాల్సి వస్తోందని …రైతు సంక్షేమం కోరే వాళ్ళే అయితే వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

7) వరంగల్ లో 317 జీవోకి వ్యతిరేకంగా వరంగల్ లో బీజేపీ నిరసన సభ జరిగింది. ఈ సభకు అస్సాం సీఎం హేమంత్ శర్మ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గరికపాటి మోహన్ రావు తదితరులు హాజరయ్యారు.

8) తిరుపతిలో ఓ పావురం కలకలం రేపింది. పాకాల మండలం వెంకట్రామాపురంలో పావురం కాలికి ట్యాగ్‌తో గ్రామస్థులకు కనిపించింది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. ట్యాగ్ పై సెల్ నెంబర్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. తమిళనాడులోని వేలూరులో పావురాల పందెం నుంచి వచ్చినట్లు గుర్తించారు.

9) సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఆయన చితికి కుమారుడు జయకృష్ణ నిప్పు పెట్టారు. కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమంది సమక్షంలోనే రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా మహేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేదు.

10) కరోనా ఎవరినీ వదలడం లేదు. జార్ఖండ్ సీఎం హేమంత్​సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్‌ బారినపడ్డారు. వీరిలో సోరెన్ మరదలు సరళ మర్ముకూ కూడా ఉన్నారు. అయితే, సీఎంకు నిర్వహించిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్‌ వచ్చింది.

Related Articles

Latest Articles