అక్టోబర్ 21, గురువారం దినఫలాలు

మేషం: ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల కోసం ధనం అధికంగా ఖర్చుచేయాల్సి వస్తుంది.. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కొంటారు. ఉద్యోగ భద్రత వల్ల భవిష్యత్తు పట్ల భరోసా వస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించు కుంటారు.

వృషభం : ఈ రోజు మీరు బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం. బంధువుల విషయంలో తలదూర్చడం కంటే మీ పనులు మీరు చేసుకోవడం మంచిది.

మిథునం : ఈ రోజు ఈరాశిలోని స్త్రీలు గృహోపకరణాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. రాబడికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు చవిచూడాల్సివస్తుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.

కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తులవారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పైఅధికారులను మెప్పిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించడం మంచిది.

సింహం : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావంతో శ్రమించాల్సి ఉంటుంది. స్త్రీలకు పని వారితో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మిత్రులను కలుసుకుంటారు.

కన్య : ఈ రోజు ఈ రాశివారు హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు. ఇంటా బయట అధిక కృషి అనంతరం మంచి ఫలితాలను పొందుతారు.

తుల : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. నూతన టెండర్ల విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు చేజిక్కించుకుంటారు. రాజకీయనాయకులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

వృశ్చికం : ఈ రోజు మీ సంతానం వివాహం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదాపడతాయి. పోస్టల్, ఎల్‌ఐసి ఏజెంట్లకు ఆర్థికంగా బాగుంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం.

ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికంగా ఉంటాయి.

మకరం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తినుబండారాలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి బాగా ఉంటుంది. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గృహ మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.

కుంభం : ఈ రోజు ఈ రాశివారు గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాల పైనే మీ ఆలోచనలుంటాయి. మీ యత్నాలకు కుటుంబీకుల సహకారం అందుతుంది. భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో తలమునకలై ఉంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. సత్కాలం ఆసన్నమైంది, మీ ఆలోచనలు, పథకాలు అమలు చేయండి.

Related Articles

Latest Articles