జూన్ 18, శుక్ర‌‌వారం దిన‌ఫ‌లాలు

మేషం: ఈ రాశివారిలో ఉన్న అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు ఇవాళ‌ తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు త‌ప్పేలా లేవు.. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి.

వృష‌భం: ఈ రాశివారు ఈ రోజు బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. అకాల భోజ‌నం వ‌ల్ల అనారోగ్య బాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఆక‌స్మిక క‌లహాల‌కు అవ‌కాశం ఉంది..

మిథునం: ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలున్నాయి.. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతాయి.. వృథా ప్ర‌యాణాలు చేస్తారు.

క‌ర్కాట‌కం: ఈ రాశివారి రుణ‌ప్రయ‌త్నాలు ఇవాళ ఫ‌లిస్తాయి.. చెడు స‌హ‌వాసంవైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

సింహం: ఈ రాశివారు ఇవాళ బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

క‌న్య‌: ఈ రాశివారు ఇవాళ సంతోషంగా గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. కుటుంబ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది. తోటివారి ప్ర‌శంస‌లు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

తుల‌: ఈ రాశివారి మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు.

వృశ్చికం: ఈ రాశివారికి కుటుంబ ప‌రిస్థితులు ఈరోజు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ‌వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉండ‌టం మంచిది.

ధ‌నుస్సు: ఈ రాశివారు త‌మ బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ఎంతో మేలు చేస్తుంది.. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు త‌ప్పేలా లేవు.. వృత్తి, ఉద్యోగ‌రంగంలో అభివృద్ధి ఉంటుంది.

మ‌క‌రం: ఈ రాశివారు ఈ రోజు శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందే అవ‌కాశం ఉంది.

కుంభం: ఈ రాశివారు ఈ రోజు కుటుంబంలో సంతోషంగా గ‌డుపుతారు.. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తినిస్తాయి.

మీనం: ఈ రాశివారు ఈ రోజు త‌మ‌కు అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ఎంతో శ్రేయ‌స్క‌రం.. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-