సెప్టెంబర్‌ 4, శనివారం దిన‌ఫ‌లాలు…

మేషం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి.

వృషభం : ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి అధికారులతో మాటపడక తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి ఉంటుంది.

మిథునం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. బంధు మిత్రుల విషయాల్లో అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం : ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పండ్లు, పూల, కూరగాయల చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. సమయానికి చేతిలో ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం.

సింహం : సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పాత రుణాలు చెల్లిస్తారు. ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారు ఎంత జాగ్రత్తగా మెలిగినా ఎక్కడో పొరపాటు దొర్లే ఆస్కారం ఉంది. సన్నిహితుల కలయిక, విందులు, వినోదాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి.

కన్య : మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వ్యవసాయ తోటల రంగాల వారికి వాతావరణంలో మార్పులు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.

తుల : పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. సమావేశాలు, సత్కార సభల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. ఆదాయానికి మించిన ఖర్చులెదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.

వృశ్చికం : భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్రయ విక్రయాలు గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.

ధనస్సు : ఆర్థిక విషయాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది.

మకరం : స్థిరాస్తి అమ్మకం కొనుగోళ్ళపై దృష్టిసారిస్తారు. ఖర్చులు అదుపుకాకపోగా, మరింత ధనవ్యయం అవుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఆత్మీయుల గురించి అప్రియమైన విషయాలు వినాల్సి వస్తుంది. స్త్రీలకు విందులు, వినోదాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.

కుంభం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఆశాభంగం తప్పదు. స్త్రీలు పంతాలకు పోయి అయినవారికి దూరమవుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.

మీనం : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. ప్రేమికుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-