సెప్టెంబ‌ర్ 30, గురువారం దిన‌ఫ‌లాలు..

మేషం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణివల్ల సదవకాశాలు జారవిడుచుకునే ప్రమాదం ఉంది..

వృషభం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం ఆలస్యంగా చేతికందుతుంది.

మిథునం: ఈ రోజు మీరు మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త ప్రయత్నాలు మొదలెడతారు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు.

కర్కాటకం: ఈ రోజు మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి.

సింహం: ఈ రోజు ఈ రాశిలోని రౌజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రయ, విక్రయాలు లాభదాయకం. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారంవుంది.

కన్య: ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.

తుల: ఈ రోజు వాస్తవానికి ఈ రాశివారు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక ముఖ్య వ్యవహారమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది.

వృశ్చికం: ఈ రోజు ఈ రాశిలోని రవాణా రంగాలవారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రౌజకీయాల్లో వారికి ఆందోళన తప్పేలా లేదు.

ధనస్సు: ఈ రోజు ఈ రాశివారి ఆదాయ వ్యయాలు వారి బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచికాదు. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనిలో దృఢసంకల్పం ఉంటే విజయం తథ్యం. నూతన పరిచయాలేర్పడతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పట్టుదలతో శ్రమిస్తేకాని పనులు నెరవేరవు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి.

కుంభం: ఈ రోజు ఈరాశివారు ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి. వైద్యులకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మీనం: ఈ రోజు ఈరాశిలోని స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్చలు జరుపడం వల్ల జయం చేకూరుతుంది. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు.

-Advertisement-సెప్టెంబ‌ర్ 30, గురువారం దిన‌ఫ‌లాలు..

Related Articles

Latest Articles