జూన్ 3 గురువారం దిన‌ఫ‌లాలు

మేషం : వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. దైవ, సేవా, కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఒక కొలిక్కి రాగలవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం. నిరుత్సాహం కలిగిస్తుంది.

వృషభం : ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విదేశీయాన యత్నాలు నెరవేరగలవు. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం. అందుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.

మిథునం : ఎల్ఐసి, పోస్టల్, ఏజెంట్లకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. జాయింట్ వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. విద్యార్థులకు తొందరపాటు తగదు. శుభకార్యాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం : కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రముఖులను కలుసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థినులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రుణం తీర్చడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.

సింహం : స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి తీరు ఇబ్బంది కలిగిస్తుంది.

కన్య : ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు, లాభసాటిగా ఉండవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ఆశాజనకం. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు యత్నిస్తారు.

తుల : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. దుబారా ఖర్చులు అధికం. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వృత్తుల వారిక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. పత్రికా ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించగలవు.

వృశ్చికం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకు లెదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది.

ధనస్సు : ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి అధికమవుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. సమావేశాలు, చర్చల్లో కొంతమంది తీరు మనస్తాపం కలిగిస్తుంది. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించినా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

మకరం : పత్రికా, వార్తా సంస్థలలోని వారికి సామాన్యం. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు మందకొడిగాసాగుతాయి.

కుంభం : ఉద్యోగస్తులు బరువు బాధ్యతలు తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు.

మీనం : ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. వస్త్రలాభం, వాహనయోగం వంటి శుభపరిణామాలున్నాయి. ఉద్యోగయత్నాలు కలిసిరాగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-