జ‌న‌వ‌రి 9, ఆదివారం దిన‌ఫ‌లాలు…

మేషం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందకపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు.

వృషభం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధువుల రాకతో ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, పండ్లు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

మిధునం : ఈ రోజు ఈ రాశివారు విందు, వినోదాలు, బంధు, మిత్రులతో కాలక్షేపం చేస్తారు. స్త్రీలకు బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. క్రీడా కార్యక్రమాలలోనూ, పోటీలపట్ల ఆసక్తి చూపుతారు.

కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలసి సరదాగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీయత్నం ఫలించకపోవచ్చు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది.

సింహం : ఈ రోజు ఈ రాశివారి అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు టీ.వీ చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.

కన్య : ఈ రోజు ఈ రాశివారు గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. అందరి సహాయ, సహకారాలు అందుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు.

తుల : ఈ రోజు ఈ రాశివారికి కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. ఆలయాలను సందర్శిస్తారు. రచయితలు, పత్రికారంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. రావలసిన ధనం రావడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. వేడుకలు, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.

మకరం : ఈ రోజు ఈ రాశివారు ఆప్తులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి వ్యకులను, పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలను ఎదుర్కొంటారు. పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే ముందు పునరాలోచన అవసరం. స్త్రీలు కళాత్మక పోటీలు, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు.

కుంభం : ఈ రోజు ఈ రాశిలోని నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో రాణిస్తారు. విద్యార్థులు కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకువస్తు, వస్త్ర, ఆభరణాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. శుభకార్యాలు, సన్నాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.

మీనం : ఈ రోజు ఈ రాశిలోని పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. మీపై సెంటిమెంట్లు, ఎదుటివారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ సంతృప్తి పరుస్తాయి. సొంత వ్యాపారాలపైనే శ్రద్ద వహించండి.

Related Articles

Latest Articles