జ‌న‌వ‌రి 13, గురువారం దిన‌ఫ‌లాలు…

మేషం: ఈ రోజు ఈ రాశివారికి అన్ని వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు కలిగే అవకాశం ఉంది… ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు అవుతాయి… ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు ఉంటాయి.

వృషభం: ఈ రోజు ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతమిత్రుల కలయిక. వాహనాలు కొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగుతోంది.

మిథునం: ఈ రోజు ఈ రాశివారు పనులు మధ్యలోవాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం తప్పలాలేదు.

కర్కాటకం: ఈ రోజు ఈ రాశివారికి సన్నిహితుల నుంచి ధనలాభం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటారు.

సింహం: ఈ రోజు ఈ రాశివారికి ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది..

కన్య: ఈ రోజు ఈ రాశివారు ఎక్కువగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారే పరిస్థితిలు రాబోతున్నాయి.

తుల: ఈ రోజు ఈ రాశివారికి కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.. దూరప్రయాణాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రోజు ఈ రాశివారికి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు: ఈ రోజు ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనయోగం. సోదరులతో సఖ్యత. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

మకరం: ఈ రోజు ఈ రాశివారికి కొన్ని వ్యవహారాల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పలాలేవు.

కుంభం: ఈ రోజు ఈ రాశివారికి మిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి.. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు విస్తరించడంలో పొరపాట్లు. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటాయి.

మీనం: ఈ రోజు ఈ రాశివారి పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి.

Related Articles

Latest Articles