జులై 17, శనివారం దినఫలాలు…

మేషం : ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. సోదరీ, సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి.

వృషభం : ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు వస్తాయి.

మిథునం : ప్రైవేటు సంస్థలలో ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు వంటి శుభవార్తలు అందుతాయి. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారిని మా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది.

కర్కాటకం : సొంతంగాగానీ, భాగస్వామ్యంగాగానీ మీరు ఆశించిన విధంగా రాణించలేరు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువుల కొనుగోలు చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. రావలసిన ధనం చేతికందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.

సింహం : వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధు మిత్రులతో మాటపడాల్సి వస్తుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన పరిష్కారం కావు. ప్రేమికుల తొందరపాటుతనం అనర్థాలకు దారితీస్తుంది.

కన్య : నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. కీలకమైన వ్యవహారలో మెళకువ వహించండి. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. పండ్లు, పూలు, కూరగాయల రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.

తుల : శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఆశాజనకం. వస్త్ర, ఫ్యాన్సీ మందులు, స్టేషనరీ వ్యాపారులకు ఆశాజనకం. మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించడం క్షేమదాయకం.

వృశ్చికం : గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది.

ధనస్సు : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. మొండిబాకీలు వసూలు కాగలవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమ, సమర్థతలకు తగిన ప్రతిఫలం. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు.

మకరం : చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి.

కుంభం : ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. బంధు మిత్రులతో సమావేశం ఉల్లాసం కలిగిస్తుంది. నిుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ప్రకటనలు, న్యాయ, బోధనా రంగాల వారికి అనుకూలం. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.

మీనం : వృత్తిపరమైన పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. సహోద్యోగులతో సమావేశాలు ఫలించకపోవచ్చు. ప్రత్యర్థుల కదలికపై ఓ కన్నేసి ఉంచండి. నిత్యావసరాలు సమకూర్చుకుంటారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-