తారక్ తనయుడికి అక్షరాభ్యాసం

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుని తన అభిమానులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఒక శుభకార్యం జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. ఆయన 2018 జూలై నెలలో జన్మించాడు. భార్గవ్ జన్మించిన కొన్ని నెలలకే రాజమౌళి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిన్న భార్గవ్ రామ్ అక్షరాభ్యాసం ఎన్టీఆర్ నివాసంలో జరిగినట్లు సమాచారం. ఈ తంతు పూర్తి చేయడానికి వచ్చిన వేద పండితులతో ఎన్టీఆర్ ఫోటోలు దిగగా… అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారరాయి. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం మొన్నీమధ్య పుట్టిన భార్గవ్ రామ్ అక్షరాభ్యాసం కూడా పూర్తవుతుంది గాని… “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ మాత్రం ఇంకా వెనక్కి వెళ్తూనే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-