రీల్ లైఫ్ స్టూడెంట్ లీడర్, పొలిటీషన్… రియల్ లైఫ్ రాజకీయం కోసమేనా?

ఎన్టీఆర్ అన్న పదం తెలుగు వారికి ఎప్పుడూ డబుల్ ధమాకా. ఎన్టీఆర్, ద లెజెండ్… పెద్దాయన పేరు తలుచుకుంటే… మనకు విశ్వ విఖ్యాత నటుడు గుర్తుకు వస్తాడు. అదే సమయంలో చరిత్రని మలుపు తిప్పిన ముఖ్యమంత్రి కూడా గుర్తుకు వస్తాడు. ఇక ఎన్టీఆర్ పేరు జనరల్ గా ఎవరు వాడినా… ఆనాటి తారక రాముడితో పాటూ ఈనాటి తారక్ కూడా జ్ఞాపకం వస్తాడు. అలాంటి డబుల్ పవర్ ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ లో ఉంది!

తాత పేరునే తన పేరుగా పెట్టుకున్న మనవడు ఎన్టీఆర్ జూనియర్. అయితే, ఆయనలా నటనలో ఇప్పటికే తన సత్తా చాటేశాడు. మరి నెక్ట్స్ పాలిటిక్సేనా? అవుననే అంటున్నారు ఫ్యాన్స్! అయితే, రియల్ లైఫ్లో మాత్రం ఇప్పుడే కాదు. ఇంకా ఆయన నిజ జీవిత రాజకీయాలకి చాలా టైం ఉందనే చెప్పాలి. కానీ, త్వరలో మాత్రం కెమెరా ముందు పొలిటీషన్ అవతారం ఎత్తుతాడట తారక్!
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంలో, రీసెంట్ గా… దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, అంతకంటే ముందు కొరటాల శివతో మన ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ‘ఎన్టీఆర్ 30’ ప్రాజెక్ట్. ఇందులో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడట జూనియర్. ఆ తరువాత ‘కేజీఎఫ్’ డైరెక్టర్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ‘ఎన్టీఆర్ 31’ అంటున్నారు సదరు చిత్రాన్ని. అందులో పొలిటీషన్ గా రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తాడట.

నెక్ట్స్ రెండూ సినిమాల్లో… స్టూడెంట్ లీడర్, పొలిటీషన్ అంటే… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే! కాకపోతే, ఇప్పటి వరకూ ఈ ప్రచారంపై ఎలాంటి కన్ ఫర్మేషన్ అయితే లేదు. చూడాలి మరి, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు తారక్ ఇమేజ్ ని ఎలా ఎలివేట్ చేస్తాయో! ఆ ప్రభావం మన తెలుగ ఫ్యూచర్ పాలిటిక్స్ పై ప్రభావం చూపినా ఆశ్చర్యమేం లేదు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-