‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ పాట..?

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక పాటను పాడనున్నడంట.

గతంలో ఎన్టీఆర్ తన సినిమాల్లోనే కాకుండా పునీత్ రాజ్ కుమార్ సినిమాలో కూడా పాట పాడిన విషయం తెల్సిందే. గాయకుడిగా ఎన్టీఆర్ కు మంచి ప్రతిభే ఉంది. అందుకే ఈ చిత్రంలో కీరవాణి, ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఇదే కనుక నిజమైతే ఈ సినిమా హైప్ మరో రేంజ్ కి వెళ్ళిపోతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles