రాయల్ లుక్ లో యంగ్ టైగర్.. ఇది కదా రాజసం అంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడితే.. సింపుల్ గా కనిపించినా.. తారక్ లుక్ లో నిత్యం రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదే తారక్ రాయల్ లుక్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండడం సాధ్యం కానీ పని. తాజాగా తారక్ రాయల్ లుక్ లో మెరిసి ఆహా అనిపించాడు. రాయల్ బ్లూ బంద్‌గాలా సూట్ లో అదరగొట్టేశాడు. ఇక ఈ ఫోటో చూసినవారందరు ఇది కదా రాజసం అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంక్రాంతి పండగ సందర్భంగా జరిగిన ఒక ఫోటోషూట్ కోసం తారక్ ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన బంద్‌గాలా సూట్‌లో భారత దేశపు సంస్కృతిని గుర్తుచేశాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చుసిన తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ లుక్ ని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పాల్గొనబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Related Articles

Latest Articles