‘రౌడీ బాయ్స్’ ని చూపిస్తానంటున్న తారక్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 8.. సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాలేజి నేపథ్యంలో ఇద్దరు గ్యాంగ్ ల మధ్య జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈసారి సంక్రాంతికి కొత్త హీరోలే బరిలో నిలుస్తున్నారు. మరి ఈ ట్రైలర్ లో ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులకు చూపిస్తే తప్ప సినిమా పై భారీ అంచనాలు నెలకొనవు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles