ఎన్టీఆర్, చరణ్ నాటుపాటకి ప్రాక్టీస్ చేశారా!?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటనే. ప్రస్తుతం ఈ పాట యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. కీరవాణి నాటు కంపోజిషన్ కంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్స్ అందరినీ ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను పేరడీ చేస్తూ పలు జంటలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అసలు ఈ డ్యాన్స్ నంబర్ కోసం చరణ్, తారక్ ఎలా ప్రిపేర్ అయిఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాల్లో పాటలకు డాన్స్ చేయటానికి ప్రాక్టీస్ సెషన్స్ కి హాజరు కారు. కొరియోగ్రాఫర్స్ డెమో డీవీడిలు పంపితే ఇంట్లో చూసి నేరుగా సెట్‌కి వచ్చి డైరెక్ట్ గా డ్యాన్స్ చేస్తారు. వీరి డాన్స్ స్కిల్స్ గురించి వారితో పని చేసిన తారామణులు, డాన్స్ మాస్టర్స్ చాలా సార్లు చెప్పారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు పాట కోసం మాత్రం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ స్టూడియోలో ప్రాక్టీస్ సెషన్ కి హాజరయ్యారట. ఇద్దరి డ్యాన్స్ మూమెంట్స్ గ్రేస్ గా కనిపించటంతో పాటు సరైన టైమింగ్‌ కుదరాలి. దీనికోసం వారం పాటు సాధన చేశారట. అందుకే ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. మీరేమంటారు!?

Related Articles

Latest Articles