జేఈఈ మెయిన్స్‌ నాల్గో విడత ఎంట్రెన్స్ తేదీల్లో మార్పు

జేఈఈ మెయిన్స్‌ నాల్గో విడత ఎంట్రెన్స్‌ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి… ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా… నెల రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం… మూడో విడత జేఈఈకి.. నాల్గో విడత జేఈఈ సెషన్‌కి మధ్య నెల రోజుల గడువు ఉండాలనే విజ్ఞప్తితో తేదీలు రీషెడ్యూల్‌ చేసినట్టు పేర్కొన్నారు.. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ నాలుగో సెషన్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నారు.. ఇక, నాల్గో సెషన్ కి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 7.32 లక్షలకు చేరుకోగా.. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో.. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా పలు పరీక్షలు రద్దు కాగా.. ఎంట్రెన్స్‌ టెస్టులను వాయిదా వేస్తూ వచ్చిన సర్కార్.. చివరకు వివిధ రకాల ఎంట్రెన్స్‌ టెస్ట్‌ల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-