రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిన నాగ్

కింగ్ నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిపోయారు. అయితే ఆయన రిలేషన్ షిప్ కౌన్సెలర్‌ అయ్యింది సినిమా కోసం కాదు బిగ్ బాస్ కోసం. శనివారం రాత్రి జరిగిన ‘బిగ్ బాస్ 5’ ఎపిసోడ్ లో నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌ లాగా వ్యవహరించారు. హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తనను నిలదీసిన నాగ్ వెళ్లిపోవాలంటే బయటకు వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయించారు. ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ లో అవసరమైన వారిని కౌన్సిలింగ్ ఇచ్చారు.

Read Also : అమెజాన్ కు “జై భీమ్” సెగ… ముదురుతున్న వివాదం

నాగార్జున సిరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించి తనకు హాని చేసుకోవడం తప్పు అంటూ మందలించాడు. ఎందుకు అలా చేశావని అడిగాడు. తను అయోమయంలో ఉన్నానని, షణ్ముఖ్‌పై తనకు ఒక విధమైన క్రష్ వస్తోందని, అయితే బయట వేరొకరితో తాను రిలేషన్ లో ఉన్నానని, అది తనకు తెలుసునని ఆమె చెప్పింది. దీంతో ఎవరు ఏమనుకుంటారు అనే విషయాలను పట్టించుకోవద్దని, ఏం అన్పిస్తే అది చేయమని అన్నారు. తర్వాత షణ్ముఖ్‌ని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి దీప్తి మిస్ అయితే హౌస్ నుండి వెళ్లిపోవాలని చెప్పాడు. షణ్ముఖ్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. మానస్ పట్ల ప్రియాంక అనుబంధాన్ని పెంచుకుంటోందని, చెప్పాలని ఓ స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇంకా యాని మాస్టర్ ప్రవర్తన చిన్న పిల్లల ప్రవర్తనల ఉందని, మార్చుకోవాలని సూచించారు.

Related Articles

Latest Articles