టెన్నిస్ స్టార్‌కు షాక్.. జకోవిచ్ వీసా రద్దు

సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జకోవిచ్ వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ చేరుకున్న జకోవిచ్‌ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ తగిన ఆధారాలు సమర్పించలేదని.. అందుకే అతడి ఎంట్రీని అడ్డుకున్నామని ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో 8 గంటల పాటు జకోవిచ్ మెల్‌బోర్న్ విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

Read Also: 2021 హార్ట్ బ్రేకింగ్ బ్రేకప్స్!

టెన్నిస్ దిగ్గజ ఆటగాడిని ఎయిర్‌పోర్టులో 8 గంటలకు పైగా ఆపడంపై సెర్బియా ప్రభుత్వం మండిపడింది. దిగ్గజ ఆటగాడిని అవమానించారని సెర్బియా ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా జకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్ అరుదైన ఘనత సాధించాడు.

Related Articles

Latest Articles