సినీ విశ్లేషకుడిపై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావాలో ట్విస్ట్!

ప్రస్తుతం సినిమాలను ప్రేక్షకుల కంటే ముందే రివ్యూ రైటర్లు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లోనూ రివ్యూ చూసి సినిమాకు వెళ్లే రోజులు వచ్చాయి. కోట్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న కొందరు నిర్మాతలు కూడా రివ్యూస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ ఇటీవల విడుదల కాగా, మిశ్రమ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాపై ప్రముఖ విశ్లేషకుడు, రివ్యూ రైటర్ కమాల్ ఆర్ ఖాన్ రాసిన సమీక్ష సల్మాన్ అభిమానుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్… కమాల్ ఆర్ ఖాన్ పై పరువునష్టం దావా వేయడంతో, తన చిత్రంపై నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకే సల్మాన్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ, ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. అసలు విషయం ‘రాధే రివ్యూ’ కాదని సల్మాన్ ఖాన్ న్యాయవాది వెల్లడించారు.

సల్మాన్ ఖాన్ అవినీతిపరుడు అని.. మనీలాండరింగ్ కూడా చేస్తున్నాడని… ఓ దోపిడీదారుడు అంటూ కమాల్ ఆర్ ఖాన్ ప్రచారం చేస్తున్నాడని న్యాయవాది వివరించారు. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన కమాల్ ఆర్ ఖాన్… సల్మాన్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తాను భారత్ లో ఉండే వ్యక్తిని కానని, అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ కెరీర్ ను ఏ విధంగా నాశనం చేస్తానని వ్యాఖ్యానించారు. తాను సరదా కోసమే సినిమాలపై రివ్యూలు వెలువరిస్తుంటానని, ఒకవేళ సల్మాన్ ఖాన్ కు నచ్చకపోతే అతడి చిత్రాలపై రివ్యూలు ఇవ్వడం మానేస్తానని తెలిపాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-