కిమ్ మ‌రో కీల‌క నిర్ణ‌యం: గ్రామీణాభివృద్ధి, ఆహారంపై ప్ర‌త్యేక దృష్టి…

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు.  ఆయుధాలు, దేశ స‌రిహ‌ద్దులు, శ‌తృదేశాలు, అమెరికా,ద‌క్షిణ కొరియాపై ఆగ్ర‌హ జ్వాల‌లు వంటి మాట‌ల‌తో ఆవేశంగా మాట్లాడే కిమ్‌, ఈసారి ఆ మాట‌ల‌ను ప‌క్క‌న పెట్టి దేశాభి వృద్ది గురించి, దేశంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో జ‌ర‌గాల్సిన అభివృద్ది గురించి, ఆహార స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డే విష‌యాల గురించి మాట్లాడారు.  2022 వ సంవ‌త్స‌రాన్ని గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్ర‌గుల్ ఇయ‌ర్ గా అభివ‌ర్ణించాడు.  కొత్త సంవ‌త్సరంలో దేశం ముందు ఎదురౌతున్న స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌డానికి అధికారులు కృషిచేయాల‌ని అన్నారు.  

Read: క‌రోనా పాజిటివిటి రేటు 5 శాతం దాటితే…

క‌రోనా మ‌హ‌మ్మారి సమ‌యంలో ఉత్త‌ర కొరియా తీవ్ర‌మైన ఆహ‌ర స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న‌ది.  తీవ్ర‌మైక క‌రువు ఏర్ప‌డింది.  స‌రిహ‌ద్దులు మూసేయ‌డంతో చైనాతో వాణిజ్యం ఆగిపోయింది.  దీంతో ఆహ‌రం ప‌రంగా ఉత్తర కొరియా తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఆహారం స‌మ‌కూర్చుకోవ‌డం, మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ముందుకు సాగ‌డ‌మే ప్ర‌ధానంశంగా పెట్టుకోవాల‌ని అధికారుల‌కు కిమ్ సూచించాడు.  ఆహార స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల నిధుల‌కు కోత‌లు విధించినా ప‌ర్వాలేద‌ని అన్నారు.  ఆహార స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఫుడ్ స్ట‌ఫ్ మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.   కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వ‌చ్చి ప‌దేళ్లైన సంద‌ర్భంగా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  దేశ ర‌క్ష‌ణ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెబుతూనే దేశం అభివృద్దికి సంబంధించిన కీల‌క నిర్ణయాలు తీస‌కున్నారు.  చాలా కాలం త‌రువాత కిమ్ ఆహ‌రం గురించి, దేశంలోని స‌మ‌స్య‌ల‌పైన కీల‌క ప్ర‌సంగం చేయ‌డంతో ఆ దేశంలో ఆనందం వెల్లివిరిసింది.  కిమ్‌లో మార్పులు వ‌చ్చినందుకు అధికారులు సంతోషం వ్య‌క్తం చేశారు.  

Related Articles

Latest Articles