నార్త్ కొరియా మరో ప్రయోగం.. క్షణాల్లో టార్గెట్ ఫినిష్..!

ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర ఆయుధాలపై నిషేధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా ‘బాంబు’ పేల్చింది. చాలా దేశాలు అణురహితంగా మారుతున్న వేళ కొరియన్ దేశం క్షిపణి పరీక్ష చేసింది. నార్త్ కొరియా అందరీ కంటే దూకుడుగా అణ్వస్త్రం వైపు అడుగులు వేస్తూ ఆసియా ఖండానికే పెనుముప్పుగా మారింది. ఉత్తర కొరియా ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది. దేశంలో ఓవైపు కరోనా, విధ్వంసాలు, ఆహార కొరత వంటి పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నార్త్ కొరియా ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గుచూపుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.

తాజాగా నార్త్ కొరియా 1500కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించే క్షిపణిని ప్రయోగించింది. టార్గెట్ ను క్షణాల్లో తునాతునకలు చేసింది. మిస్సైల్ రేంజ్ పరిధిలోకి వచ్చే కొరియా, జపాన్ దేశాలు ఉలికిపాటుకు గురయ్యాయి. ఆసియా ఖండంలో ఆందోళనకర పరిస్థితులకు ఈ ప్రయోగం కారణమవుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఆధునిక నియంతగా గుర్తింపు పొందిన ఉత్తరకొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్ తన నాయకత్వంలో ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకున్నారు. అణ్వాయుధాలపై నిషేధాన్ని విధించిన తర్వాత నార్త్ కొరియా మరింత దూకుడును ప్రదర్శిస్తోంది.

అణురహిత ఆయుధాలను పెద్దఎత్తున ఆ దేశం సమకూర్చుకుంటోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైల్స్.. వాటిని సంధించడానికి వినియోగించే ట్యాంకులను భారీగా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అత్యాధుక క్షిపణిని నార్త్ కొరియా విజయవంతంగా పరీక్షించింది. 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన టార్గె‌ట్‌ను లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ కేవలం 7,780 సెకన్లలోనే టార్గెట్ ను తునాతునకలు చేసింది. ఈ మిస్సైల్ ను ప్యాటర్న్-8 ఫ్లయిట్-ఆర్బిట్‌గా పిలుస్తున్నారు.

ఈనెల 11, 12తేదిల్లో నార్త్ కొరియా గుర్తుతెలియని ఓ ప్రదేశం నుంచి ప్రయోగించిన మిస్సైల్ టార్గెట్ ను పూర్తి చేసిందని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) వెల్లడించింది. 1500 కి.మీ దూరంలోని టార్గెట్‌ను ఈ మిస్సైల్ 7,580 సెకెన్ల వ్యవధిలో అధిగమించినట్లు స్పష్టం చేసింది. ఈ ప్రయోగ సమయంలో కిమ్ జొంగ్ ఉన్ హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే ప్రయోగ విజయవంతం అవడంపై ఆయన సంతోషం వ్యక్తంచేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

గత ఆరునెల కాలంలోనే ఉత్తర కొరియా పలు క్షిపణి ప్రయోగాలను చేసింది. కిందటి మార్చిలో చివరిసారిగా షార్ట్-రేంజ్ బాల్లిస్టిక్స్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించింది. తాజాగా మరోసారి మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టింది. దీని పరిధిలోకి దక్షిణ కొరియాతోపాటు జపాన్ దేశాలు రానున్నాయి. అణ్వస్త్రాలపై నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఆదేశం ఆయుధాల సామాగ్రిపై దృష్టిసారించడం ఆసియా ఖండంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా కన్పిస్తోంది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఆయుధ సంపత్తికే మొగ్గుచూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-