బ్రిటన్‌లో మరో వైరస్‌ టెన్షన్‌

కరోనా వైరస్‌తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నోరో పేరుతో పిలుస్తున్న ఈ వైరస్ ఐదు వారాలుగా బ్రిటన్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు సంబంధించి 154 కేసులు గుర్తించారు. నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నోరో వైరస్‌ బారినపడిన వారికి తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుందని బ్రిటల్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. ఓవైపు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అని ఆ దేశం భావిస్తున్న తరుణంలో.. నోరో బ్రిటన్‌కు కునుకు లేకుండా చేస్తోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-