లేడీ సింగర్స్ రచ్చ : న్యూడ్ ఫోటోతో లక్షల వ్యూస్!

ఇండియాలో సింగర్స్ అంటే పెద్దగా ఫ్యాషన్ కు ప్రతీకగా ఉండరు. ఈ తరం గాయనీగాయకులు ముందు వారికంటే కాస్త గ్లామరస్ గానే కనిపిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఇండియాలో ఫ్యాషన్ అంటే సినిమా స్టార్స్, మోడల్స్ లాంటి వారే! బట్ వెస్ట్రన్ ఫ్యాషన్ వరల్డ్ లో సింగర్స్ కూడా ఫ్యాషన్ కు ఐకాన్స్ గా చెలామణి అవుతుంటారు. అటువంటి ఇద్దరు హాట్ లేడీ సింగర్స్ ఒకేచోట కలిస్తే? వారిద్దరి పోస్టర్ ఒకటి నెట్ లో సెగలు రేపుతోంది…

Read Also: ‘కేన్స్’లో మెరిసిన రోబో బ్యూటీ !

పాప్ సింగర్ నార్మనీ, అమెరికన్ ర్యాపర్ అండ్ సాంగ్ రైటర్ కార్డి బీతో కలసి ఓ సాంగ్ రిలీజ్ చేసింది. జూలై 15న విడుదలైన ‘వైల్డ్ సైడ్’ వీడియో సాంగ్ ఇప్పుడు దుమారం రేపుతోంది. సంగీతం, సాహిత్యం ఎలాగూ ఆకట్టుకుంటున్నాయి… వాటికంటే ఎక్కువగా సెక్సీ లేడీస్ ఇద్దరూ తెరపై చేసిన రచ్చ మామూలుగా లేదు! నార్మనీ, కార్డీ బీ తమ స్కిన్ షోతో, ఇంటిమేట్ మూమెంట్స్ తో, సెక్సీ స్టెప్పులతో మాయ చేసి మోహంలో ముంచేశారు…

Read Also: రాఘవ లారెన్స్ చిత్రానికి తమన్ సంగీతం!

నార్మనీ, కార్డీ బి తమ ‘వైల్డ్ సైడ్’ పాట విడుదలకి కొంత ముందుగా ఓ హాట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొత్త పాటతో సరికొత్తగా వస్తున్నామంటూ న్యూడ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరూ ఒంటిపై బట్టలేమీ లేకుండా సేద తీరారు. జాగ్రత్తగా పొడవాటి వెంట్రుకల్ని అడ్డేసుకుని అందాల్ని చూసేవారికి అందనీయకుండా దాచేసుకున్నారు. కార్డీ బీతో నార్మనీ హాట్ పిక్ వేగంగా వైరల్ అయింది. కార్డీ బీ యద మీద కేవలం ఓ చిన్న నెక్లెస్, నార్మనీ బొడ్డుకు ఒక డైమండ్ పియర్సింగ్ తో దర్శనం ఇవ్వటంతో రసిక భక్తులు ఆగలేకపోయారు! ఆ దెబ్బతో ‘వైల్డ్ సైడ్’ సాంగ్ రిలీజ్ తరువాత కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ వచ్చిపడ్డాయి! పేరులోనే ‘వైల్డ్’ ఉన్నాక సాంగ్ ఎలా ఉండో మళ్లీ చెప్పుకోవాలంటారా?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-