హుజురాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు.. ఈటల జమున నామినేషన్‌ విత్‌డ్రా..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసింది.. ఇవాళ బీజేపీ తరపున నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు కూడా నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా.. ఫైనల్‌గా బైపోల్‌ బరిలో 30 మంది అభ్యర్థులు మిగిలిపోయారు.. ముగ్గురు అభ్యర్థులు ఈటల రాజేందర్‌ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌ (టీఆర్ఎస్‌), వెంకట్ బల్మూర్ (కాంగ్రెస్‌) ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా.. ఐదుగురు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు.. మిగతావారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులే.

ఇక, పోటీలో ఉన్న అభ్యర్థుల ఆధారంగా బ్యాలెట్ లేదా ఈవీఎంల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.. ఒక్కో బ్యాలెట్ లో 15 మంది అభ్యర్థులు 1 నోటా కలిపి 16 గుర్తులతో పొందుపర్చాల్సి ఉంటుంది… కావున.. ఇప్పటి వరకు బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను చూస్తే మాత్రం హుజురాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ కోసం రెండు ఈవీఎంలు పెట్టాల్సి ఉంటుంది.. మరో వైపు ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లతో నెంబర్లతో అక్షర క్రమంలో సింబల్స్ కేటాయింపు కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

-Advertisement-హుజురాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు.. ఈటల జమున నామినేషన్‌ విత్‌డ్రా..

Related Articles

Latest Articles