బద్వేల్‌ బరిలో 15 మంది అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్నాయి.. ఇక, ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది.. అయితే, ఇవాళ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో.. ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 15 మంది అభ్యర్థులు మిగిలారు.. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు ముగిసేలోపు మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో పరిశీలనలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.. మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఫైనల్‌గా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు అయ్యింది.

-Advertisement-బద్వేల్‌ బరిలో 15 మంది అభ్యర్థులు

Related Articles

Latest Articles