ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ…

కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 27 మంది 53 సెట్లు నామినేషన్లు దాఖలు చేసారు. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. టీఆర్ఎస్ తరపున ఎల్ రమణ, బాను ప్రసాద్ రావులు నామినేషన్ వేశారు. అయితే ఈ పోటీకి దూరంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నియోజకవర్గాల వారిగా ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ పరిసరాల్లోని క్యాంపులకు తరలిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారు క్యాంపులకు దూరం. దాంతో రసవత్తరముగా మారాయి ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం. ఇక నామినేషన్ వేసిన పలువురు స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించే పనిలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నామినేషన్ వేసిన కొందరు స్వతంత్ర అభ్యర్థులు కాంటాక్ట్ లోకి కూడా రావడం లేదు.

Related Articles

Latest Articles