బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరెవరంటే ?

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు. గత నాలుగు వారాల్లో వరసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ నలుగురు కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజుతో ఐదవ వారంలోకి షో అడుగు పెడుతోంది. ఈరోజు రాత్రి ఎపిసోడ్‌లో ఐదవ వారానికి గానూ ఎలిమినేషన్ కోసం నామినేషన్లు జరుగుతాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా నామినేట్ అయినట్టు తెలుస్తోంది.

Read Also : గుంట నక్క ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్!

ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రతి కంటెస్టెంట్ ను పవర్ రూమ్‌కు పిలిచారు. వారందరూ ఇద్దరు సభ్యులను నామినేషన్ కు ఎంచుకుని బిగ్ బాస్‌కు ప్రైవేట్‌గా చెప్పాల్సి ఉంటుంది. ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ ప్రతి నామినేషన్ ఎపిసోడ్ లాగే వాడివేడిగా సాగినట్టు కన్పిస్తోంది. రవి, లోబో, ప్రియా, సన్నీ గత వారం నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ లో తొమ్మిది మంది నామినేటెడ్ కాగా, అందులో ఎవరు బిగ్ బాస్ కు వీడ్కోలు పలుకుతారో చూడాలి.

-Advertisement-బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరెవరంటే ?

Related Articles

Latest Articles