కెమెస్ట్రీలో ఇద్దరికి నోబెల్‌

ఈ ఏడాది వరుసగా వివిధ రంగాలకు చెందిన నోబెల్‌ ప్రైజ్‌లను ప్రకటిస్తూ వస్తున్నారు.. ఈ సంవత్సరం ర‌సాయ‌న శాస్త్రం (కెమిస్ట్రీ)లో జ‌ర్మనీకి చెందిన‌ బెంజ‌మిన్ లిస్ట్‌, అమెరికాకు చెందిన‌ డేవిడ్ డ‌బ్ల్యూసీ మెక్‌మిల‌న్‌ల‌కు కెమిస్ట్రీ నోబెల్ వరించింది.. అణువుల‌ను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాట‌లిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను గాను నోబెల్‌ అవార్డును లిస్ట్‌, మెక్‌మిల‌న్‌ల‌కు ద‌క్కింది. వీరి ఆవిష్కరణలు ఫార్మాసూటిక‌ల్ ప‌రిశోధ‌న‌ల‌పై గొప్ప ప్రభావం చూపిందని ఈ సందర్భంగా పేర్కొన్న అకాడ‌మీ.. నోబెల్‌తో విజేత‌ల‌కు ఇచ్చే 11 లక్షల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీని ఇద్దరికీ స‌మానంగా పంచనున్నట్టు వెల్లడించింది. ఇక, 1968లో జ‌ర్మనీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లో జన్మించిన బెంజ‌మిన్ లిస్ట్.. గోతె వ‌ర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి.. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.. మరోవైపు.. 1968లో యూకేలోని బెల్‌షిల్‌లో జ‌న్మించారు మెక్‌మిల‌న్.. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్‌డీ చేసిన ఆయన.. ప్రస్తుతం ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు.

-Advertisement-కెమెస్ట్రీలో ఇద్దరికి నోబెల్‌

Related Articles

Latest Articles