ఫిజిక్స్‌లో నోబెల్‌ ప్రకటన.. ముగ్గురు శాస్త్రవేత్తల‌కు నోబెల్‌

ప్రతీ ఏడాది లాగే.. ఈ సంవత్సరం కూడా నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు.. ఇవాళ భౌతిక శాస్త్ర నోబెల్ ప్రకటన వెలువడగా… సంక్లిష్ట భౌతిక వ్యవ‌స్థపై మ‌న అవ‌గాహ‌న‌కు సంబంధించి ముగ్గురు శాస్త్రవేత్తలు స్యుకురో మ‌నాబె, క్లాస్ హాసెల్‌మాన్‌, గియోర్గియో పారిసిల‌ను ఫిజిక్స్ నోబెల్ వరించింది.. రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.. ఇక, నోబెల్ బ‌హుమ‌తితోపాటు ఇచ్చే ప్రైజ్‌మ‌నీలో స‌గం పారిసికి, మిగ‌తా స‌గం మాన‌బె, హాసెల్‌మాన్‌ల‌కు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫిజిక్స్ నోబెల్ గెలిచిన పారిసి.. క్రమ‌ర‌హిత సంక్లిష్ట ప‌దార్థాల‌లో దాగి ఉన్న న‌మూనాల‌ను కనుగొనగా.. సంక్లిష్ట వ్యవ‌స్థల సిద్ధాంత ర‌చ‌న‌ల‌కు అత‌ని ఆవిష్కర‌ణ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ పేర్కొంది. ఇక, కార్బన్‌డైఆక్సైడ్ స్థాయిలు పెరిగిన కొద్దీ భూ ఉప‌రిత‌ల ఉష్ణోగ్రత‌లు ఎలా పెరుగుతున్నాయో నిరూపించిన స్యుకురో మ‌నాబెను కూడా ఈసారి ఫిజిక్స్ నోబెల్‌కు ఎంపికయ్యారని తెలిపింది.

-Advertisement-ఫిజిక్స్‌లో నోబెల్‌ ప్రకటన.. ముగ్గురు శాస్త్రవేత్తల‌కు నోబెల్‌

Related Articles

Latest Articles